PM Modi: ‘నా ప్రతి నిర్ణయం.. మీ కోసమే’: మోదీ
అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించేందుకు మరింతగా శ్రమిస్తానని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ట్విటర్ వేదికగా స్పందించారు.
దిల్లీ: దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపర్చడం కోసమేనని అన్నారు. ఈ పదవీకాలాన్ని తొమ్మిదేళ్ల సేవగా అభివర్ణించారు.
‘దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో నేనెంతో వినమ్రత, కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి చర్య.. ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించినవే. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించేందుకు ఇంతకంటే ఎక్కువగా శ్రమిస్తాను’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఇక తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భాజపా(BJP) ఈ రోజు భారీ ప్రచార కార్యక్రమాలకు తెరతీసింది. ‘స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్’పేరిట నెల రోజుల పాటు దీనిని నిర్వహిస్తుంది. ‘నేషన్ ఫస్ట్’అనే నినాదంతో ఈ సమయంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని భాజపా ఓ ప్రకటనలో వెల్లడించింది. మోదీ(Modi) 2014, మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019, మే 30న ఆయన రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delhi Liquor scam: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?