finance ministry: ప్రభుత్వ శాఖల వ్యయాలపై కేంద్రం ఆంక్షల తొలగింపు!

కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల వ్యయాలపై విధించిన ఆంక్షలను నేడు ఆర్థిక శాఖ తొలగించింది. దీంతో అవి ఈ ఆర్థి

Published : 24 Sep 2021 23:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల వ్యయాలపై విధించిన ఆంక్షలను నేడు ఆర్థిక శాఖ తొలగించింది. దీంతో అవి ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలకు తగినట్లు ఖర్చులు చేయవచ్చు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు పెరుగుతుండటంతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆదాయాలపై ప్రభావం పడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

‘‘జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి ప్రభుత్వ శాఖల వ్యయాలు బడ్జెట్‌ అంచనాల్లో 20శాతం లోపు ఉండాలన్న మార్గదర్శకాలను పునఃసమీక్షించాము. వీటిని తక్షణమే ఉపసంహరించుకొంటున్నాము. మళ్లీ ఆదేశాలు వచ్చేవరకూ.. ఆయా మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్లు ఇక నుంచి వారి బడ్జెట్‌ అంచనాలకు తగినట్లు వ్యయాలు చేయవచ్చు’’ అని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ శుక్రవారం పేర్కొంది. ఉక్కు, కార్మిక, పౌరవిమానయాన శాఖ వంటి 80శాఖల వ్యయాలను ప్రభుత్వం ఇప్పటి వరకు 20శాతం లోపు ఉండేట్లు కట్టడి చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని