Mumbai: స్కూల్ ఫీజు కట్టనందుకు పరీక్షకు ‘నో’.. ప్రిన్సిపల్‌పై కేసు నమోదు..!
స్కూల్ ఫీజు చెల్లించలేదని పరీక్షకు అనుమతించని ప్రిన్సిపల్‌పై కేసు నమోదయ్యింది. పరీక్ష సమయంలో తరగతి గదిలో చిన్నారిని వేరుగా కూర్చోబెట్టడంపైనా క్లాస్ టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది.
ముంబయి: పాఠశాల ఫీజు చెల్లించలేదనే కారణంతో రెండో తరగతి విద్యార్థినిని పరీక్షకు అనుమతించని ప్రిన్సిపల్‌పై కేసు నమోదయ్యింది. ఆయనతోపాటు క్లాస్ టీచర్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబయిలోని దాదర్‌లో ఇటీవల చోటుచేసుకుంది.
దాదర్‌లోని ఓ పేరుగాంచిన పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఫీజు స్కూల్ ఫీజు చెల్లించలేదట. ఇటీవల జరిగిన యూనిట్ పరీక్షలకు పాఠశాల యాజమాన్యం బాలికను అనుమతించలేదు. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరీక్ష సమయంలో.. తరగతి గదిలో ఇతర చిన్నారులకు దూరంగా వేరుగా కూర్చోబెట్టారని అందులో పేర్కొన్నారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. జువెనైల్ జస్టిస్ యాక్టు సెక్షన్ 75కింద స్కూల్ ప్రిన్సిపల్‌తోపాటు క్లాస్ టీచర్‌పైనా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. ఈ కేసులో ఇప్పటివరకు ఎవ్వర్ని అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ విషయాన్ని చిన్నారి తండ్రి విద్యాశాఖ అధికారుల దృష్టికీ తీసుకెళ్లారు. వారి సూచన మేరకు చిన్నారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఇదిలాఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన ఎంతోమంది ఆటగాళ్లు ఆ పాఠశాలలో చదువుకున్నవారే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి