సీరంలో అగ్ని ప్రమాదానికి కారణమదే..!

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారుచేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి కారణం అక్కడ జరుగుతోన్న వెల్డింగ్‌ పనులే కారణమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది.

Updated : 23 Feb 2024 16:33 IST

ప్రాథమిక అంచనా వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

పుణె: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారుచేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి కారణం అక్కడ జరుగుతోన్న వెల్డింగ్‌ పనులే కారణమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ‘పుణె మంజ్రిలో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ భవనంలో వెల్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రదేశానికి సమీపంలోనే ఇన్సులేషన్‌ వస్తువులు ఉండటం మూలంగా అక్కడ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నాం. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు’ అని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ థోప్‌ వెల్లడించారు.

ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీరం అధినేత అదర్‌ పూనావాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన  ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన భవనం.. కొవిషీల్డ్‌ తయారవుతోన్న భవనానికి దూరంగా ఉంది. దీంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని సీరం యాజమాన్యం వెల్లడించింది.

ఇవీ చదవండి..
సీరం అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి
టీకా వేయించుకోనున్న ప్రధాని మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని