Updated : 25 Jun 2021 09:26 IST

China: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం

బీజింగ్‌: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హెనాన్‌  ప్రావిన్స్‌లోని ఓ మార్షల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో 12 మంది స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మార్షల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ ఇన్‌ఛార్జిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని