ఆసుపత్రికి నిప్పంటినా.. ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ సక్సెస్‌!

ఓవైపు ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగుతున్నా.. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సాహసోపేతంగా ఓ రోగికి ఓపెన్‌-హార్ట్‌ సర్జరీని పూర్తిచేశారు. రష్యాలోని బ్లాగోవెస్కెన్స్‌క్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్‌ల కాలం నాటి ఇక్కడి ఆసుపత్రిలో వైద్యులు

Updated : 03 Apr 2021 08:33 IST

రష్యాలో వైద్యుల ఘనత

మాస్కో: ఓవైపు ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగుతున్నా.. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సాహసోపేతంగా ఓ రోగికి ఓపెన్‌-హార్ట్‌ సర్జరీని పూర్తిచేశారు. రష్యాలోని బ్లాగోవెస్కెన్స్‌క్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్‌ల కాలం నాటి ఇక్కడి ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించిన కొద్దిసేపటికి మంటలు చెలరేగాయి. వైద్య సిబ్బంది ఏమాత్రం బెదరకుండా 2 గంటల పాటు సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రోగిని వేరేచోటుకు మార్చారు. ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురైన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అదే సమయంలో ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ చేస్తున్న గదికి అన్నివిధాలుగా సంరక్షణ ఏర్పాట్లు చేశారు. లోపలికి పొగ వెళ్లకుండా పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గదికి విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక కేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది వైద్యులు, నర్సులతో కూడిన బృందం సర్జరీలో పాల్గొంది. ‘‘మంటలు చెలరేగినా.. ఆ రోగిని కాపాడేందుకు మేం చేయగలిగిందంతా చేశాం’’ అని వైద్యులు తెలిపారు. ఈ ఆసుపత్రిని 1907లో నిర్మించారు. పైకప్పు చెక్కతో చేసింది కావడంతో నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ తెలిపింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఆసుపత్రి నుంచి 128 మందిని ఖాళీ చేయించి సురక్షితంగా తరలించినట్లు తెలిపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని