Delhi: మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 90 వాహనాలు దగ్ధం

దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 90 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి........

Updated : 08 Jun 2022 17:12 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగ్నేయ దిల్లీ జామియానగర్‌ మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 90 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని 11 ఫైరింజన్ల సాయంతో అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ భారీ ప్రమాదంలో మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌లో ఉన్న 10 కార్లు, ఓ బైక్‌, రెండు స్కూటర్లు, 30 కొత్త ఈ-రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలతో సహా పలు వాహనాలు మంటల్లో దగ్ధమైనట్లు దిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు