60అంతస్తుల భవనంలో అగ్నికీలలు.. 19వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని ఓ ఆకాశహర్మ్యంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాల్‌బాగ్‌ ప్రాంతంలో గల 60 అంతస్తుల లగ్జరీ నివాస సముదాయం అవిఘ్న

Updated : 22 Oct 2021 15:18 IST

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని ఓ ఆకాశహర్మ్యంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాల్‌బాగ్‌ ప్రాంతంలో గల 60 అంతస్తుల లగ్జరీ నివాస సముదాయం అవిఘ్న పార్క్‌ సొసైటీలోని 19వ అంతస్తులో శుక్రవారం మధ్యాహ్న సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అటు ముంబయి మేయర్‌ కిశోరీ పడ్నేకర్ కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో పొగ దట్టంగా కమ్మేసింది. 

కాగా.. మంటలు వేగంగా వ్యాపించడంతో 19వ అంతస్తు నుంచి కింద పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగిందని తెలియగానే భవనంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న అరుణ్‌ తివారీ వెంటనే అక్కడకు వెళ్లారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అరుణ్ ఆ అంతస్తులో చిక్కుకుపోయారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే ఓ ఫ్లాట్‌లోని బాల్కనీలోకి పరిగెత్తాడు. అక్కడి రెయిలింగ్‌ పట్టుకుని కిందకు దిగాలని ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్‌ కోల్పోవడంతో క్షణాల్లోనే అరుణ్‌ అక్కడి నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని