స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!

దిల్లీ(Delhi)లో ఓ భవనంలో మంటలు చెలరేగగా.. తమ ప్రాణాలు లెక్కచేయకుండా స్థానికులు సహాయకచర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Published : 28 Sep 2023 16:37 IST

దిల్లీ: ఒక భవనంలో మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫైరింజన్లకు సమాచారం అందినప్పటికీ.. ఇరుకైన దారుల్లో వెళ్లడానికి వీలుకాలేదు. అదే సమయంలో స్థానికులు రంగంలోకి దిగి, 35 మందిని కాపాడేందుకు సహకరించారు. వారు కాపాడిన వారిలో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. (fire accident)

దిల్లీ(Delhi)లోని ముఖర్జీ నగర్‌లోని మహిళల వసతి గృహంలో గురువారం మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్‌ మీటర్లు ఉన్న ప్రాంతం నుంచి ఆ మంటలు వచ్చాయి. అక్కడ పాత ఫర్నీచర్, ఇతర సామాన్లు ఉన్నాయని  దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమికంగా వెల్లడించింది. అక్కడ మొదలైన మంటలు.. తర్వాత ఎగువ అంతస్తులకు ఎగబాకాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ.. 20 ఫైరింజన్లను పంపింది. కానీ ట్రాఫిక్ అంతరాయాల వల్ల ఎనిమిది మాత్రమే అక్కడకు చేరుకున్నాయి.

మణిపుర్‌లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్‌ అధికారికి పిలుపు..

ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించారు. లోపల ఉన్నవారిని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఘటన దృశ్యాల్లో.. కొందరు వ్యక్తులు కలిసి లోపలివైపు నుంచి తాళం వేసి ఉన్న భవనం గేట్లు తెరవడం కనిపించింది. అన్నిమాపక సిబ్బందితో కలిసి వారు కూడా వసతి గృహంలోని మహిళలను కాపాడారు. మంటలు ఎగిసిపడుతున్నా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకున్నా వారు డేరింగ్‌గా ముందుకెళ్లారు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన నుంచి 35 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ముఖర్జీ నగర్.. దిల్లీ యూనివర్సిటీకి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ పేయింగ్‌ గెస్ట్‌ హాస్టల్స్‌, కోచింగ్‌ సెంటర్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రస్తుతం వసతిగృహం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు