కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: 50 మంది మృతి

ఇరాక్‌లోని ఓ కొవిడ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 39 మంది రోగులు చనిపోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్‌-హుస్సేన్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలడంతో మంటలు

Updated : 13 Jul 2021 09:00 IST

బాగ్దాద్‌: ఇరాక్‌లోని ఓ కొవిడ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 50 మంది కరోనా బాధితులు చనిపోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్‌- హుస్సేన్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలి మంటలు వార్డుకు వ్యాపించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. 70 పడకలతో 3 నెలల క్రితం ఈ కరోనా వార్డును ప్రారంభించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆసుపత్రిని మంటలతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో కొవిడ్‌ వార్డుల్లో చిక్కుకున్న బాధితులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా బాగ్దాద్‌లోని ఓ కొవిడ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలి 82 మంది రోగులు చనిపోగా, 110 మంది గాయపడ్డారు. ఇరాక్‌ ఇప్పటివరకు 14 లక్షల కొవిడ్‌ కేసులు నమోదు కాగా, 17,000పైగా చనిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని