Updated : 20 Jan 2021 11:55 IST

భారత్‌ నుంచి భూటాన్‌కు కొవిడ్‌ టీకాలు

ముంబయి: పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా ఆరు దేశాలకు భారత్‌ బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లను ఈ ఉదయం భూటాన్‌కు ఎగుమతి చేసింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.5లక్షల డోసులను థింపు నగరానికి  పంపించింది. మరికొద్దిసేపట్లో మాల్దీవులకు కూడా టీకా డోసుల విమానం బయల్దేరనుంది. ఈ రెండు దేశాలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, సీషెల్స్‌ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది.

కరోనా ప్రభావం నేపథ్యంలో గ్రాంట్‌ సహకారం కింద భారత సంస్థలు అభివృద్ధి పరిచిన టీకాలను పొరుగు దేశాలకు ఇవ్వనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారాలు, నెలల తరబడి దశలవారీగా భాగస్వామ్య దేశాలకు టీకాలు పంపించనున్నట్లు వెల్లడించింది. శ్రీలంక, అఫ్గానిస్తాన్, మారిషస్ దేశాల నుంచి ఎంత అవసరమో ధ్రువీకరణ ఇంకా రాలేదన్న విదేశాంగ శాఖ.. వచ్చిన వెంటనే ఈ దేశాలకు కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి..

మరో 45లక్షల డోసులకు ఆర్డర్‌

అలర్జీ ముప్పుంటే కొవిషీల్డ్‌ టీకా వద్దు


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని