Hathras stampede: హాథ్రస్ ఘటన.. భోలేబాబాపై తొలికేసు

హాథ్రస్ తొక్కిసలాట (Hathras stampede)కు కారణమైన భోలేబాబాపై తొలికేసు నమోదైంది. అలాగే ఆయన ముఖ్యసేవాదర్ ఇటీవల పలువురు రాజకీయ నేతలను సంప్రదించినట్లు వెల్లడైంది. 

Updated : 06 Jul 2024 18:45 IST

దిల్లీ: దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras stampede) ఘటనకు సంబంధించి భోలేబాబాపై తొలికేసు నమోదైంది. పట్నా కోర్టులో ఈ కేసు ఫైల్ అయిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జులై 2న హాథ్రస్‌లో నిర్వహించిన సత్సంగ్‌కు 80వేల మందికి ఏర్పాట్లు చేయగా.. రెండున్నర లక్షలమంది హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ‘సేవాదర్‌ ఆర్మీ’గా పిలిచే బృందం ఈ కార్యక్రమాలను నిర్వహించింది. భక్తులు పోటెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బాబా వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాతే ఘటన జరిగిందని ఆయన తరఫు లాయర్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని, భక్తులను భద్రతా సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆ రోజు ముఖ్యసేవాదర్‌గా ఉన్న దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ నిందితుడిగా ఉన్నాడు. అతడిని శుక్రవారం రాత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

మధుకర్ ఇటీవల పలువురు రాజకీయ నేతలతో కాంటాక్ట్ అయ్యారని గుర్తించారు. బాబా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిధులు. విరాళాలు సేకరించేవాడని వెల్లడించారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన లావాదేవీలను, కాల్‌ వివరాలను పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని