ఆస్ట్రేలియాలో కరోనా టీకాకు ఓకే..

కరోనా నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన టీకా వినియోగానికి ఆస్ట్రేలియా ప్రభుత్వ అనుమతించింది. ఆ దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి టీకా ఇదే. 16 ఏళ్ల పైబడిన వయసు వారందికీ ఈ టీకా ఇచ్చేందుకు......

Updated : 25 Jan 2021 11:31 IST

సిడ్నీ: కరోనా నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన టీకా వినియోగానికి ఆస్ట్రేలియా ప్రభుత్వ అనుమతించింది. ఆ దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి టీకా ఇదే. 16 ఏళ్ల పైబడిన వయసు వారందికీ ఈ టీకా ఇచ్చేందుకు అక్కడి ‘థెరపెటిక్ గూడ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌’ ఆమోద ముద్ర వేసింది. తొలి విడతలో వైద్యారోగ్య సిబ్బంది, వృద్ధాశ్రమాల్లో పనిచేసేవారితో పాటు ఇతర కరోనా యోధులకు టీకా ఇవ్వాలని నిర్ణయించారు.

టీకా వినియోగానికి అనుమతి లభించడంపై ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం అత్యవసర వినియోగం కోసమే కాకుండా.. కరోనా టీకా సమర్థతను పూర్తి స్థాయిలో సమీక్షించిన తొలి దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటని ఆయన తెలిపారు. 10 మిలియన్ డోసుల కోసం ఫైజర్‌తో ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. ఇప్పటి వరకు వివిధ కంపెనీలతో 140 మిలియన్‌ డోసులకు ఒప్పందాలు కుదిరినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్‌ హంట్‌ వెల్లడించారు. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ నుంచి 53.8 మిలియన్‌ డోసులు అందనున్నట్లు తెలిపింది. వీటిలో 50 మిలియన్ల డోసులు మెల్‌బోర్న్‌లోని సీఎస్‌ఎల్‌ ఔషధ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబరు నాటికి ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆ దేశంలో దాదాపు 30వేల మందికి కరోనా సోకగా.. వీరిలో 900 మంది మరణించారు.

ఇవీ చదవండి...

ఆరు రోజుల్లో 10 లక్షల మందికి టీకాలు

కరోనా కష్టాలు పేదలకే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని