monkeypox: మంకీపాక్స్‌ నిర్ధారణ స్వదేశీ కిట్‌ విడుదల.. ఏపీలోనే తయారీ

ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌ టెక్‌ జోన్‌ (AMTZ)లో తయారైంది. స్వదేశంలో తయారైన మొట్టమొదటి మంకీపాక్స్‌ నిర్ధారణ కిట్‌.....

Updated : 19 Aug 2022 22:01 IST

అమరావతి: ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌ టెక్‌ జోన్‌ (AMTZ)లో తయారైంది. స్వదేశంలో తయారైన మొట్టమొదటి మంకీపాక్స్‌ నిర్ధారణ కిట్‌ ఇదే కావడం విశేషం. ఆర్టీపీసీఆర్‌ విధానంలో ట్రాన్సాసియా బయో-మెడికల్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ కిట్‌ను కేంద్రంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ ఆవిష్కరించారు. Transasia-Erba పేరుతో విడుదల చేసిన ఈ మంకీపాక్స్ నిర్ధారణ కిట్ అత్యంత సున్నితమైనదని, ఖచ్చితత్వం కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.

అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించిన మంకీపాక్స్‌ను ముందస్తుగా గుర్తించి మెరుగైన చికిత్స కోసం ఈ కిట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రాన్సాసియా వ్యవస్థాపక ఛైర్మన్‌ సురేశ్‌ వాజిరాణి తెలిపారు. కిట్‌ను ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారు అల్కా శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని