
DRDO: రక్షణ పరికరాల తయారీకి కీలక ముందడుగు!
దిల్లీ: ఆయుధాలు, రక్షణ పరికరాల దేశీయ తయారీకి మరింత ఊతమిచ్చేలా కీలక ముందడుగు పడనుంది. భారత్ దేశీయంగా రూపొందించనున్న అణ్వాయుధ దాడి సామర్ధ్యం గల మూడు జలాంతర్గాముల నిర్మాణంలో 95 శాతం భారత్ తయారీ వస్తువులనే వినియోగించనున్నారు. రూ.50 వేల కోట్లతో ఈ మూడు జలాంతర్గాముల తయారీ ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపే అంశాన్ని పరిశీలిస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ(డీఆర్డీఓ)కు చెందిన విశాఖపట్నం కేంద్రంలో వీటిని తయారు చేస్తారు. త్వరలోనే ఈ జలాంతర్గాముల సంఖ్యను ఆరుకు పెంచనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు సహా దేశీయ రక్షణ రంగానికి వీటి తయారీ ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలతో, ఆర్థిక వ్యవస్ధకు కూడా మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. విదేశాల నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయగలమని డీఆర్డీఓ నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించాయి. ఒక వేళ ఆ అవసరం వస్తే వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల నుంచి తీసుకుంటాయని తెలిపాయి. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగల ఆరు అణ్వాయుధ దాడి సామర్ధ్య జలాంతర్గాముల ప్రాజక్టు తయారీ కోసం ఉద్దేశించిన అరిహంత్ రకం ప్రాజక్టుకు ఇది అదనం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.