కోబ్రా దళంలోకి ‘మహిళా వారియర్స్‌’

అత్యంత దట్టమైన అడవుల్లో కార్యకలాపాలు సాగించే నక్సల్స్‌ పనిపట్టేందుకు కోబ్రా కమాండోలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ దళంలో అంతా పురుషులే ఉండగా.. చరిత్రలో తొలిసారి

Updated : 06 Feb 2021 17:08 IST

గురుగ్రామ్‌: దట్టమైన అడవుల్లో నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు కోబ్రా కమాండోలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ దళంలో అంతా పురుషులే ఉండగా.. చరిత్రలో తొలిసారి మహిళలను ఇందులోకి తీసుకున్నారు. 34 మంది సీఆర్పీఎఫ్‌ యోధురాళ్ల బృందం నేడు లాంఛనంగా కోబ్రా యూనిట్‌లో చేరింది.  

గురుగ్రామ్‌లోని కదార్‌పుర్‌లో గల సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో సీఆర్పీఎఫ్‌ డీజీ ఏపీ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ మహిళల బృందాన్ని కోబ్రా యూనిట్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోబ్రాకు ఎంపికైన మహిళలు ప్రదర్శించిన యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీఆర్పీఎఫ్‌ దళంలోని ఆరు మహిళా బెటాలియన్ల నుంచి ఈ 34 మందిని ఎంపిక చేశారు. మూడు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్న అనంతరం.. ఈ మహిళా వారియర్స్‌ సుక్మా, దంతెవాడ, బిజాపుర్‌ లాంటి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తారు. 

ఈ సందర్భంగా ఏపీ మహేశ్వరి మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయాలనుకునే ఎంతోమంది యువతులకు ఈ మహిళా వారియర్స్‌ ఆదర్శప్రాయమని కొనియాడారు. యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్లలోనూ వీరు తమ శక్తియుక్తులు సమర్థంగా ఉపయోగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో అత్యంత కఠినమైన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టేందుకు సీఆర్పీఎఫ్‌ 2009లో కోబ్రా(కమాండ్‌ బెటాలియన్‌ ఫర్‌ రెజల్యూట్‌ యాక్షన్‌) యూనిట్‌ను ఏర్పాటు చేసింది. 

ఇవీ చదవండి..

మన విలువలకు న్యాయవ్యవస్థే ఆధారం

చక్కా జామ్‌: బెంగళూరు, దిల్లీలో ఉద్రిక్తత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని