Tunnel collapse: సొరంగంలో విషాదం.. ఆరు మృతదేహాలు వెలికితీత!

జమ్ము కశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో పెను విషాదం చోటుచేసుకుంది.....

Updated : 21 May 2022 17:31 IST

కొనసాగుతున్న సహాయక చర్యలు

జమ్మూ: జమ్ము కశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో పెను విషాదం చోటుచేసుకుంది. శిథిలాల నుంచి తాజాగా మరో మృతదేహాం బయటపడింది. దీంతో ఈ దుర్ఘటనలో మృత్యువాతపడిన వారి సంఖ్య ఆరుకి చేరింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీసినట్టు రాంబన్‌ పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. 

రాంబన్‌ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంత భాగం గురువారం రాత్రి కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 10.30గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే, సహాయక చర్యలు కొనసాగుతుండగానే శుక్రవారం సాయంత్రం తాజాగా మరో కొండచరియ విరిగిపడటంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదం నుంచి సహాయక చర్యల బృందంలోని 15 మంది తృటిలో తప్పించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు