Flight Fares: భారత్‌-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్‌ ధరలకు రెక్కలు

భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. దీంతో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

Published : 22 Sep 2023 15:55 IST

దిల్లీ/టొరంటో: భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం భారత్‌-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతం మేర పెరిగాయని తెలిపాయి. గురువారం భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో దిల్లీ నుంచి టొరంటో విమాన టికెట్‌ బుకింగ్స్‌కు చివరి నిమిషంలో డిమాండ్ పెరిగిందని వెల్లడించాయి. 

భారత్‌-కెనడాల మధ్య ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ కెనడాలు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నాయి. వారానికి 48 విమానాలు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు దిల్లీ-టొరంటో, దిల్లీ-వాంకోవర్‌ మధ్య ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఇక ఎయిర్‌ కెనడా దిల్లీ-టొరంటో మధ్య ప్రతి రోజూ విమాన సర్వీసులను నడుపుతోంది. దాంతోపాటు వారంలో మూడు విమాన సర్వీసులను దిల్లీ-మాంట్రియల్‌ మధ్య నిర్వహిస్తోంది. 

ట్రూడోకు షాక్‌.. పాపులారిటీలో ప్రతిపక్షనేత ముందజ

అంతర్జాతీయ ఎయిర్‌ ట్రాఫిక్‌ మార్కెట్‌లో భారత్‌-కెనడా వాటా 1.2 శాతం కాగా, కెనడా విమాన రవాణాలో భారత్‌ నాలుగో అతిపెద్ద దేశం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య 6,78,614 మంది ప్రయాణించారు. తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దిల్లీ-టొరంటో విమాన టికెట్‌ ధరల గురించి విచారించే వారి సంఖ్య పెరిగిందని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని