పైలట్ రెండు సార్లు ప్రయత్నించినా..
ప్రమాదానికి ముందు ఎయిరిండియా విమానాన్ని పైలట్ కేరళలోని కొలికోడ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడానికి కనీసం రెండుసార్లు ప్రయత్నించారట.
మ్యాప్ ద్వారా వెల్లడి
కొలికోడ్: ప్రమాదానికి ముందు ఎయిరిండియా విమానాన్ని పైలట్ కేరళలోని కొలికోడ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడానికి కనీసం రెండుసార్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్లో ఉంచిన మ్యాప్ ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది.
స్వీడన్‌కు చెందిన ఫ్లైట్‌ట్రాకర్ 24 అనే సంస్థ కమర్షియల్ విమానాలకు సంబంధించి ట్రాకింగ్ సమాచారాన్నంతా ఒక మ్యాప్ రూపంలో అందిస్తుంది. శుక్రవారం దుబాయ్ నుంచి కొలికోడ్ వరకు బోయింగ్ 737ఎన్జీ విమాన ప్రయాణం సక్రమంగానే సాగింది. కొలికోడ్ విమానాశ్రయంలోని టేబుల్ టాప్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్‌వే మీద నుంచి జారీ లోయలోకి పడిపోయింది. అయితే ఈ ప్రమాదానికి ముందు విమానాన్ని సురక్షితంగా దింపడానికి పైలట్ రెండు సార్లు ప్రయత్నించినట్లు ఆ మ్యాప్ వెల్లడిచేస్తోంది. పైలట్ అంతగా ప్రయత్నించినా.. ప్రమాదం మాత్రం తప్పలేదు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!