లాజిస్టిక్స్‌ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌ శిక్షణ

లాజిస్టిక్స్‌ రంగంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణనిచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని లాజిస్టిక్స్ నైపుణ్య రంగ మండలి (ఎల్‌ఎస్‌సీ)తో కలిసి మెమోరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎంవోయూ) ఒప్పందం చేసుకుంది.

Published : 09 Jan 2021 00:05 IST

కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందడుగు

దిల్లీ: లాజిస్టిక్స్‌ రంగంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణనిచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని లాజిస్టిక్స్ నైపుణ్య రంగ మండలి (ఎల్‌ఎస్‌సీ)తో కలిసి ఒప్పందం చేసుకుంది.  ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. ఇందులో ఈ-కామర్స్‌ రంగానికి సంబంధించిన శిక్షణను అందిచనున్నారు. రానున్న రోజుల్లో ఈ కామర్స్‌ రంగం మరింత వృద్ధి చెందనున్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు నైపుణ్య శిక్షణను అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఎల్ఎస్‌ఈ ఛైర్మన్‌ రామానుజమ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ కామర్స్‌ రంగంలో ఉన్న అవకాశాలు, డిమాండ్‌ ఆధారంగా తగినంత మానవశక్తిని అందించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్‌తో మా ఈ భాగస్వామ్యం ఎన్నో మార్పులను తెస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు. ఇందులో భాగంగా శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద ఒక ధ్రువపత్రాన్ని అందిస్తారు. ఇది అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీకి సమాన అర్హత కలిగి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌కు ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, జర్మనీ, సౌదీ అరేబియాల్లో గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..

ఆ ఆరు రాష్ట్రాల్లోనే బర్డ్‌ఫ్లూ

అమెరికా చరిత్రలోనే చీకటి రోజులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని