ధరలు అదుపులో ఉంచేందుకే వాటిపై జీఎస్టీ

కరోనా వ్యాక్సిన్లపైనా, మెడికల్‌ ఆక్సిజన్‌పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దు చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక.....

Published : 09 May 2021 19:04 IST

దిల్లీ: కరోనా వ్యాక్సిన్లపైనా, మెడికల్‌ ఆక్సిజన్‌పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దు చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. వ్యాక్సిన్‌ (5 శాతం పన్ను), ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల (12 శాతం పన్ను) ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె వరుస ట్వీట్లు చేశారు.

ఆయా వస్తువులకు ఒకవేళ జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే.. దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదారుడిపైనే భారం పడుతుందని సీతారామన్‌ వివరించారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, దాని ముడిపదార్థాలు వంటి ఔషధాలపై దిగుమతి సుంకాలు, ఐజీఎస్టీని తగ్గించినట్లు వివరించారు. సంబంధిత ఔషధాల జాబితాను కూడా ట్వీట్‌ చేశారు. 45+ వయసున్న వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తోందని, దానికి కేంద్రమే పన్ను చెల్లిస్తోందని తెలిపారు. తద్వారా వసూలైన జీఎస్టీ మొత్తంలో సగం మళ్లీ రాష్ట్రాలకే వెళుతోందని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని