Sushma Swaraj Daughter: అమ్మకి ఇష్టమైన ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తా!

వారసత్వంగా వచ్చే ఆస్తులు, కట్టుబాట్లే కాదు.. సంప్రదాయం, సద్గుణాలూ ఎంతో కీలకం. అవే మనిషి గొప్పతనం గురించి మాట్లాడుకునేలా చేస్తాయి.  కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత సుష్మా స్వరాజ్‌ ఒక్కగానొక్క కుమార్తె బన్సూరి స్వరాజ్‌.. తన తల్లి ఎంతో ఇష్టం పడే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.  

Updated : 09 Nov 2021 18:18 IST

 ఎల్‌కే అడ్వాణీ పుట్టినరోజు వేడుకల్లో సుష్మా స్వరాజ్‌ తనయ బాన్సురి స్వరాజ్‌
 

దిల్లీ: వారసత్వంగా వచ్చే ఆస్తులు, కట్టుబాట్లే కాదు.. సాంప్రదాయాలు, సద్గుణాలూ ఎంతో కీలకం. అవే మనిషి గొప్పతనం గురించి మాట్లాడుకునేలా చేస్తాయి. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత సుష్మా స్వరాజ్‌ ఒక్కగానొక్క కుమార్తె బన్సూరి స్వరాజ్‌.. తన తల్లి ఎంతో ఇష్టపడే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్‌ కృష్ణ అడ్వాణీ 94వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుష్మ కుమార్తె బాన్సురి స్వరాజ్‌.. అడ్వాణీ ఇంటికి చాక్లెట్‌ కేకు తీసుకెళ్లి కట్‌ చేయించారు. సుష్మ రాజకీయాలు, పాలనాతీరులో ఎంత చురుకుగా వ్యవహరించే వారో.. అనుబంధాలకూ అంతే ప్రాముఖ్యతనిచ్చారు. ఆమె జీవించి ఉన్న ప్రతీ ఏడాది తప్పకుండా అడ్వాణీ ఇంటికి చాక్లెట్‌ కేకు తీసుకొచ్చి కోయించి ఆరోజును పండుగలా నిర్వహించేవారు. సరిగ్గా అదే పద్ధతిని ఇప్పుడు కూతురు కొనసాగిస్తుండటం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా అడ్వాణీతో దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారామె. ‘‘అడ్వాణీ జీ! మీరు దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా అమ్మ ఏటా రాఖీ పండుగ రోజు, ఆత్మీయుల పుట్టినరోజు నాడు వాళ్లింటికెళ్లి వేడుకలు చేసేవారు. ఆ సాంప్రదాయాన్నే ఇప్పుడు నేను కొనసాగిస్తున్నా’’ అంటూ తల్లిని గుర్తుచేసుకున్నారు బాన్సురి స్వరాజ్‌. 2019 సుష్మా స్వరాజ్‌ గుండెపోటుతో మరణించారు. మరణానంతరం ఆమెకు  2020లో పబ్లిక్ అఫైర్స్ రంగంలో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘‘పద్మవిభూషణ్’’ లభించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని