Precaution Dose: 9 నెలల నుంచి 90 రోజులకు.. వారికోసం బూస్టర్ డోసు వ్యవధి తగ్గింపు

విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం వెసులుబాటు కల్పించింది.

Published : 13 May 2022 18:31 IST

దిల్లీ: విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య వ్యవధిని తగ్గించింది. ఈ రెండింటి మధ్య అంతరాన్ని తొమ్మిది నెలల నుంచి 90 రోజులకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రం బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ తీసుకోవడానికి అర్హులని ప్రకటించింది. దీనిపై విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థుల నుంచి ఆరోగ్య శాఖకు పలు అభ్యర్థనలు వచ్చాయి. ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుంది. నిపుణుల సలహా మేరకు ఆ అంతరాన్ని తగ్గిస్తున్నట్లు నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. వారు వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు తగ్గట్టుగా ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని వెల్లడించారు. తాజాగా ఆ వ్యవధిని మూడు నెలలకు తగ్గిస్తూ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని