j&kపై పాక్‌ దుష్ప్రచారం తిప్పికొట్టే అవకాశం!

జమ్మూ కశ్మీర్‌లో ఐరోపా సమాఖ్య దౌత్యవేత్తలు పర్యటిస్తున్నారు. నేడు, రేపు పర్యటించనున్న దౌత్యవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించనుంది....

Published : 17 Feb 2021 23:11 IST

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఐరోపా సమాఖ్య దౌత్యవేత్తలు పర్యటిస్తున్నారు. రెండురోజుల పాటు పర్యటించనున్న దౌత్యవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించనుంది. జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదాను రద్దుచేసిన అనంతరం ఇటీవల జిల్లా అభివృద్ధి కమిటీ (డీడీసీ)ల ఎన్నికలు నిర్వహించడంతో అక్కడ ప్రజాస్వామ్యం బలపడుతోందని నిరూపించేందుకు కేంద్రానికి అవకాశం దక్కింది. జమ్మూ కశ్మీర్‌పై అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ చేస్తున్న దష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు దౌత్యవేత్తల పర్యటన ఉపకరిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బుద్గాం జిల్లాలో స్థానికులతో సమావేశమైన ఐరోపా దౌత్యవేత్తలు డీడీసీకి ఎన్నికైన ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. గురువారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌తోనూ చర్చలు జరపనున్నారు. గతంలోనూ ఐరోపా సమాఖ్య ప్రతినిధులు జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని