ఉత్తరాఖండ్‌: మృతులకు గుర్తుగా సంస్మరణ వనం

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో వరదల కారణంగా మరణించిన వారికి గుర్తుగా ఎన్‌టీపీసీ ఓ సంస్మరణ వనాన్ని అభివృద్ధి చేయనుంది. జోషిమఠ్‌లోని ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో ఆ సంస్థ డైరెక్టర్‌ యూకే భట్టాచార్య మొక్కలు నాటి ఈ వనాన్ని ప్రారంభించారు....

Published : 20 Feb 2021 14:35 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో వరదల కారణంగా మరణించిన వారికి గుర్తుగా ఎన్‌టీపీసీ ఓ సంస్మరణ వనాన్ని అభివృద్ధి చేయనుంది. జోషిమఠ్‌లోని ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో ఆ సంస్థ డైరెక్టర్‌ యూకే భట్టాచార్య మొక్కలు నాటి ఈ వనాన్ని ప్రారంభించారు. మూడు హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ అడవికి స్మృతి వన్‌ అని నామకరణం చేశారు. జోషిమఠ్‌లో ఏర్పాటు చేసిన మృతుల సంతాప సభలో భట్టాచార్య ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈనెల 7న ధౌలిగంగా ఉప్పొంగి వరదలు సృష్టించిన ప్రళయానికి తపోవన్‌ విద్యుత్కేంద్రం కొట్టుకుపోయింది. ఈ వరదల్లో 204 మంది గల్లంతయ్యారు. విద్యుత్కేంద్రంలోని సొరంగంలో చిక్కుకున్నవారి కోసం రెండు వారాలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటివరకు 62 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరికొందరి శరీర భాగాలు లభ్యమయ్యాయి. అవి ఎవరివో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని