Afghan Crisis: ఘనీ కంటే ఘనుడు ఆయన సోదరుడు!

తాలిబన్ల చెరలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు

Updated : 21 Aug 2021 15:36 IST

కాబుల్: తాలిబన్ల చెరలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముందుగానే ఓటమిని ఊహించిన మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన సోదరుడు అష్మత్ ఘనీ అహ్మద్‌జాయ్‌ తాలిబన్లతో కలిసిపోయాడని తెలుస్తోంది. తాలిబన్లకు తన మద్దతు ప్రకటిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తాలిబన్ల నాయకుడు ఖలీల్-ఉర్-రెహమాన్, వారి మత పండితుడు ముఫ్తీ మహ్మద్ జాకీర్ సమక్షంలో తన మద్దతు ప్రకటిస్తూ ప్రమాణం చేశాడు. అష్మత్‌ ఘనీ కూచిస్ గ్రాండ్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మద్దతుతో తాలిబన్లు మరింత చెలరేగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాలిబన్లు కాబుల్‌కు చేరుకొక ముందే అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే, ఆ సమయంలో భారీ నగదు, ఖరీదైన నాలుగు కార్లతో ఉడాయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన యూఏఈ నుంచి వీడియో సందేశంలో మాట్లాడారు. ‘రక్తపాతాన్ని నివారించడానికి దేశాన్ని విడిచి వెళ్లాను. నాపై వస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. కావాలంటే యూఏఈ కస్టమ్స్‌లో నిర్ధారించుకోవచ్చు. దేశం నుంచి వచ్చేటపుడు కనీసం నా బూట్లు మార్చుకోనే సమయం కూడా లేదు. నాకు ముప్పు ఉందని తొందరగా వెళ్లాలని సెక్యూరిటీ చెప్పారు. దీంతో దేశాన్ని విడిచి యూఏఈ వచ్చాను’ అని అష్రాప్ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు