సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా కన్నుమూత

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Updated : 16 Apr 2021 13:08 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే, రంజిత్‌ సిన్హాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

1974 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రంజిత్‌ సిన్హా బిహార్‌ క్యాడర్‌కు చెందినవారు. 21ఏళ్ల వయసులోనే జాతీయ సర్వీసులకు ఎంపికైన రంజిత్‌ సిన్హా.. 2012లో సీబీఐ డెరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఐటీబీపీ డీజీగా, ఆర్‌పీఎఫ్‌లో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఎంఫిల్‌ కూడా రంజిత్‌ సిన్హా పూర్తిచేశారు. అంతేకాకుండా పోలీస్‌ విభాగాలకు సంబంధించిన సమస్యలపై పలు మ్యాగజైన్లు, జర్నల్‌లకు రంజిత్‌ సిన్హా వ్యాసాలు రాసేవారు. ఆయన పోలీస్‌ విభాగానికి చేసిన సేవలకు గానూ రాష్ట్రపతి చేతుల మీదుగా పోలీస్‌ మెడల్‌ను అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని