Chitra Ramkrishna: ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్టు

కో-లొకేషన్‌ కుంభకోణం కేసులో నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ అధికారులు దిల్లీలో అరెస్టు చేశారు.

Updated : 07 Mar 2022 03:28 IST

ముంబయి: కో-లొకేషన్‌ కుంభకోణం కేసులో నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ అధికారులు దిల్లీలో అరెస్టు చేశారు. ‘హిమాలయ యోగి’ పేరుతో చిత్రా రామకృష్ణ  ఎన్‌ఎస్‌ఈకి సంబంధించి అత్యంత కీలక రహస్య సమాచారాన్ని పంచుకున్నారని, స్టాక్‌ మార్కెట్‌లో అనేక అవకతవకలను పాల్పడ్డారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్‌ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఆమెకు ముందస్తు బెయిల్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిందితురాలి పట్ల చాలా దయంగా మెలిగిందని, ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, నిజాలు రాబట్టడానికి ఆమెకు నిరంతర కస్టడీ విచారణ అవసరమని దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్‌ అగర్వాల్‌  వ్యాఖ్యానించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని