- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Trump: చైనా వైరస్ అన్నారని కేసు..!
ఇంటర్నెట్‌డెస్క్: అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు కష్టాలను తీసుకొచ్చాయి. చైనీస్-అమెరికన్ పౌరహక్కుల గ్రూప్ ఒకటి ఆయనపై కోర్టులో కేసు వేసింది. ఆయన కొవిడ్-19 వైరస్‌ను ‘చైనా వైరస్’అన్నారని పేర్కొంది. ఈ మేరకు చైనీస్ అమెరికన్ సివిల్‌రైట్స్ సంస్థ(సీఏసీఆర్సీ) న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. కరోనావైరస్ను ట్రంప్ ఆధార రహితంగా చైనా వైరస్ అని అభివర్ణించారని పేర్కొంది. ఈ వైరస్ విషయంలో ట్రంప్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని ఆరోపించింది. ఫలితంగా ఇటీవల కాలంలో ఆసియన్ అమెరికన్లపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఇప్పటికి కూడా ట్రంప్ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చైనీస్ వైరస్ అనే పదాన్ని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు అమెరికాలోని ప్రతి ఆసియన్ అమెరికన్‌కు 1 డాలర్ చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ సంస్థ కోరంది. అంటే మొత్తం 22.9 మిలియన్ డాలర్లు అవుతాయి. ఈ నిధితో ఒక మ్యూజియం ఏర్పాటు చేసి.. ఆసియా జాతుల వారు అమెరికా సమాజ అభివృద్ధికి ఎలా కృషి చేశారో తెలియజేసే వస్తువులను అక్కడ ఏర్పాటు చేయాలని సీఏసీఆర్సీ భావిస్తోంది. దీనిపై ట్రంప్ సలహాదారుడు జేసన్ మిల్లర్ ‘ది హిల్’ పత్రికతో మాట్లాడుతూ ‘ఇది చాలా అరాచకమైన, మూర్ఖమైన లాసూట్. పూర్తి హాస్యాస్పదమైంది. నేనే ఆ కేసుకు లాయర్ అయితే.. కేసును చూసి కోర్టు నాపై ఆంక్షలు విధిస్తుందని భయపడతాను ’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Uttam kumar reddy: ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రధాని చెప్పాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
-
India News
Corona: దిల్లీలో ఆస్పత్రుల్లో చేరికలు 60% పెరిగాయ్..!
-
India News
వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
-
Politics News
Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
-
India News
Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్‌వే..!
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..