Ropeway Accident: రోప్‌వే ప్రమాదం.. 19 గంటలుగా కేబుల్ కార్లలో పర్యాటకులు..!

పండగ రోజు సరదాగా గడుపుదామని వచ్చిన పర్యాటకులు ప్రమాదం అంచున చిక్కుకుపోయారు. జార్ఘండ్‌లోని దేవ్‌ధర్ జిల్లాలో త్రికూట పర్వతాల్లో రోప్‌ వే కేబుల్ కార్లు ఆదివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

Updated : 11 Apr 2022 13:40 IST

రంగంలోకి వైమానిక దళం

దేవ్‌ధర్: పండగ రోజు సరదాగా గడుపుదామని వచ్చిన పర్యాటకులు ప్రమాదం అంచున చిక్కుకుపోయారు. ఝార్ఘండ్‌లోని దేవ్‌ధర్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్‌ వే కేబుల్ కార్లు ఆదివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరు మరణించారు. నిన్న సాయంత్రం నుంచి దాదాపు 50 మంది రోప్‌వే క్యాబిన్లలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

బైద్యనాథ్ ఆలయ సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు.. 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతాల్లోని రోప్‌ వే వద్ద పర్యటిస్తుంటారు. అయితే నిన్న ఆ రోప్‌ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. దాదాపు 50 మంది 19 గంటలకు పైగా రోప్‌ వే క్యాబిన్లలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగింది. అలాగే రెండు Mi-17 హెలికాఫ్టర్లు కూడా రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయని  వైమానిక దళం వెల్లడించింది.  

ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, పర్యాటకులను సురక్షితంగా తరలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరారు. ఈ త్రికూట్ రోప్‌వే భారత్‌లో ఎత్తైన వర్టికల్ రోప్‌ వే. ఇది 766 మీటర్ల పొడువు ఉంటుంది. 25 క్యాబిన్లు ఉంటాయి. ప్రతి క్యాబిన్‌లో నలుగురు ప్రయాణించవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని