Updated : 27 May 2022 10:46 IST

kashmir: సోషల్‌ మీడియా నటి హంతకులతో సహా నలుగురు ఉగ్రవాదుల హతం

ఇంటర్నట్‌డెస్క్‌: కశ్మీరీ టీవీ, సోషల్‌ మీడియా నటి అమ్రీన్‌ భట్ హంతకులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆమె హత్య జరిగిన 24 గంటల్లోనే భద్రతా దళాలు వారిని ఎన్‌కౌంటర్‌ చేశాయి. అవంతిపొరాలోని అగన్‌హజిపొరాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. వీరిద్దరు స్థానిక ఉగ్రవాదులే అని భద్రతా దళాలు తెలిపాయి. వీరిలో షాహిద్‌ ముస్తాక్‌ భట్‌ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్‌ హబీబ్‌ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్‌ హత్యలో నిందితులని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు.  వీరి వద్ద నుంచి ఒక ఏకే 56 రైఫిల్‌, నాలుగు మ్యాగ్జైన్లు, ఒక పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీరిద్దరు కొత్తగా ఉగ్రవాదంలోకి చేరిన తర్వాత అమ్రీన్‌ హత్యకు పాల్పడ్డారు.

శ్రీనగర్‌లోని సౌర ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో మొత్తం మూడు రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులను దళాలు హతమార్చాయి. వీరిలో ముగ్గురు జైషే మహమ్మద్‌కు చెందినవారు కాగా.. ఏడుగురు లష్కరే ఉగ్రవాదులు.

25వ తేదీన బుద్గాం జిల్లా చదూరలోని తన నివాసంలో ఉన్న అమ్రీన్‌పై రాత్రి 7.55 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమ్రీన్‌ భట్‌ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయ్యారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని