భారత్‌ ప్రయాణికులపై ఫ్రాన్స్‌ ఆంక్షలు! 

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్‌ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఫ్రాన్స్‌ ఆంక్షలు విధించనుంది. ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులు....

Published : 21 Apr 2021 19:01 IST

ప్యారిస్‌: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్‌ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఫ్రాన్స్‌ ఆంక్షలు విధించనుంది. ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులు 10 రోజుల క్వారంటైన్‌ ఉండేలా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వ అధికారప్రతినిధి గాబ్రియేల్‌ అట్టల్‌ వెల్లడించారు. కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆరోగ్య పరిస్థితులు సీరియస్‌గా, ఆందోళనకరంగా ఉన్న కొన్ని దేశాలకు సంబంధించి మరోసారి ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ జాబితాలో భారత్‌ను కూడా చేరుస్తామన్నారు. ప్రయాణాలపై ఆంక్షలకు సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

తమ దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తలో భాగంగా బ్రెజిల్‌ నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ప్యారిస్‌ నగరం నిషేధించగా.. తాజాగా ఫ్రాన్స్‌ వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. అర్జెంటీనా, చిలీ, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులకు క్వారంటైన్‌లో ఉంచాలని ఇప్పటికే ప్యారిస్‌ నిర్ణయించింది. ప్రయాణాల విషయంలో భారత్‌ను ఇప్పటికే బ్రిటన్‌ రెడ్‌ లిస్ట్‌లో చేర్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని