Blood Group Information: రక్త దాతలకు ఉచితంగా బ్లడ్‌ గ్రూప్‌ సమాచారం

రక్త దానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బ్లడ్‌ బ్యాంక్‌ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Published : 14 Jun 2024 05:07 IST

ఆసుపత్రులకు కేంద్ర వైద్య శాఖ నిర్దేశం

దిల్లీ: రక్త దానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బ్లడ్‌ బ్యాంక్‌ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనికనుగుణంగా ఈ నెల 14న (శుక్రవారం) ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. రక్త దాతల పేర్లను నమోదు చేసుకోవాలని, స్వచ్ఛంద దాతల నుంచి రక్తం సేకరించాలని, ఇటువంటి వారందరికీ వారి బ్లడ్‌ గ్రూప్‌ ఏమిటో ఉచితంగా తెలియజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆదేశించారు. బ్లడ్‌ గ్రూప్‌ ఏమిటో తెలియడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని