
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం!
ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం
చండీగఢ్: పంజాబ్‌లో మహిళలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. పంజాబ్ ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే ప్రతిపాదనకు పంజాబ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ (పంజాబ్ రోడ్‌వేస్) బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఇందుకోసం నూతన పథకాన్ని ప్రవేశపెడుతామని మార్చి 5వ తేదీన అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలను సాధికారతవైపు నడిపించడంలో భాగంగానే ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పంజాబ్‌లో అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ప్రభుత్వ ఏసీ, వోల్వోతో పాటు ఇతర లగ్జరీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టంచేసింది. ఉచితంగా ప్రయాణించే మహిళలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారుగా ఉన్న గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం మహిళలకు లబ్ది చేకూర్చడమే కాకుండా రాష్ట్రంలో మహిళా భద్రతకు ఎంతో దోహదం చేస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ప్రభుత్వ నిర్ణయంతో పంజాబ్‌లో దాదాపు 1.31కోట్ల మంది బాలికలు, మహిళలకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, పంజాబ్ జనాభా 2.77కోట్ల కాగా వారిలో కోటి 46 లక్షల మంది పురుషులు, కోటి 31లక్షల మంది మహిళలున్నారు. తాజా పథకం వయసుతో సంబంధం లేకుండా పంజాబ్‌లోని మహిళలందరికీ వర్తించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Talasani: కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. మేం కూడా సిద్ధమే: తలసాని
-
India News
Manipur landslide: 27కు చేరిన మణిపుర్ మృతులు.. 20 మంది జవాన్లే..!
-
General News
ED: మధుకాన్ గ్రూప్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
-
Sports News
IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
-
General News
Telangana News: తెలంగాణలో మరో 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!