
murder hunt: 35ఏళ్ల తర్వాత డీఎన్ఏ ఆధారంగా హంతకుడి గుర్తింపు..!
ఇంటర్నెట్‌డెస్క్: కొన్ని దశాబ్దాల పాటు పారిస్‌ను వణికించిన ‘లాగ్రేలీ’ (మచ్చల మనిషి) ఆత్మహత్య చేసుకొన్నాడు. కొన్నేళ్లుగా ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతనో మాజీ మిలటరీ ఆఫీసరని పోలీసులు గుర్తించారు. అతని పేరు ఫ్రాన్సిసో వెరోవె. పోలీసులు అతని డీఎన్ఏను హత్యా స్థలాల నుంచి సేకరించిన డీఎన్ఏతో పోల్చి చూశారు. రెండు ఒకరివిగానే నిర్ధారణ అయింది.
ఎవరీ లాగ్రేలీ..
1986 నుంచి 1994 మధ్య పారిస్‌లో పలు సీరియల్ హత్యలు చేశాడు. అతని ముఖంపై మొటిమల మచ్చల వంటివి ఉంటాయి. అందుకే ‘లాగ్రేలీ’ అనే నిక్‌నేమ్ పెట్టారు. 1986లో 11 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని అతను హత్యాచారం చేశాడు. అదే సమయంలో నిందితుడి డీఎన్ఏ పోలీసులకు లభించింది. 1987లో ఓ టీనేజీ బాలికను అత్యాచారం చేశాడు. సంఘటనల తీరును బట్టి దర్యాప్తు బృందాలు నిందితుడు పోలీసు అయి ఉంటాడని అనుమానించాయి. ఇతనిపై పలు హత్య కేసులతో ఆరు అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. 1986లో చిన్నారి అత్యాచారం కేసు దర్యాప్తునకు సంబంధించి అప్పట్లో పారిస్ సమీపంలో ఉన్న 750 మంది మిలటరీ పోలీసులను గుర్తించి విచారణకు హాజరు కావాలని గత నెల 24వ తేదీన సమన్లు పంపారు. 27వ తేదీ నుంచి అతను అదృశ్యం అయ్యాడు. బుధవారం మాంట్ పెల్లర్లో ఒక రిసార్ట్ వద్ద ఫ్రాన్సిసో వెరోవె కొన్ని మాత్రలను అతిగా తీసుకొన్నాడు. తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.