Assam: బాల్య వివాహాలు.. అస్సాంలో మరోసారి అరెస్టులు

అస్సాం (Assam)లో బాల్య వివాహం చేసుకోవడం, ఈ పెళ్లికి సహకరించిన వారిపై ప్రభుత్వం మరోసారి అరెస్టులను కొనసాగిస్తోంది. పోలీసులు 800 మందికి పైగా అరెస్టు చేశారు. 

Published : 03 Oct 2023 15:37 IST

గువహటి: రాష్ట్రంలో బాల్య వివాహాలు (Child Marriages), మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అస్సాం (Assam) ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ఈ అంశంలో సమాజంలో మార్పు తీసుకురావడంతో పాటు చిన్నారులకు మంచి భవిష్యత్తు కోసం కృషి చేస్తోంది. దీంతో బాల్య వివాహాం చేసుకున్నా.. అందుకు సహకరించినా వారిపై ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. తాజాగా 800 మందికి పైగా అరెస్టు చేసిన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma)ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారిపై ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వం అరెస్టులను కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా మరోసారి రాష్ట్ర పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటున్నారు. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా 800 మందికి పైగా తాజాగా అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

దేశ రాజధానిలో మోస్ట్‌వాంటెడ్‌ ఐసిస్‌ ఉగ్రవాది అరెస్ట్‌..!

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ ఏడాది ప్రారంభంలో 2,278 మందిని అరెస్టు చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్ల ఎదుట నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అస్సాంలో బాల్య వివాహాలు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద, 14 ఏళ్ల లోపు వారిని పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని కొన్ని నెలల క్రితం అస్సాం కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ అరెస్టు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం ప్రకటించారు.

బాల్య వివాహం చేసుకున్న వారితో పాటు దీనికి సహకరించిన మత పెద్దలపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. బాలికల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో బాల్య వివాహాలకు సంబంధించిన కేసుల్లో మొత్తం 3,907 మందిని అరెస్టు చేసినట్లు ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో బిశ్వశర్మ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని