Nitin Gadkari: అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు.. సీఎంలకు లేఖలు రాస్తా!

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ కీలక సూచన చేశారు. కమర్షియల్‌ ట్రక్కు డ్రైవర్లకు ......

Published : 21 Sep 2021 19:30 IST

దిల్లీ: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ కీలక సూచన చేశారు. కమర్షియల్‌ ట్రక్కు డ్రైవర్లకు నిర్దిష్టమైన పనిగంటలు అమలు చేయాలన్నారు. పైలట్ల మాదిరిగానే ట్రక్కు డైవర్లకు కూడా నిర్దిష్టమైన పని గంటలు నిర్ణయిస్తే.. అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు. యూరోపియన్ ప్రమాణాలతో సమానంగా కమర్షియల్‌ వాహనాల్లో ఆన్-బోర్డ్ స్లీప్ డిటెక్షన్ సెన్సార్‌లను ఏర్పాటు చేసే విధానంపై పనిచేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. జిల్లా రహదారి కమిటీ సమావేశాలు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా జరిగేలా దేశంలోని ముఖ్యమంత్రులు, జిల్లా కలక్టర్లకు లేఖలు రాయనున్నట్టు పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మండలి (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)కి నామినేట్‌ అయిన సభ్యుల పరిచయ కార్యక్రమంలో ఈ ఉదయం పాల్గొన్న గడ్కరీ.. ప్రతి రెండు నెలలకోసారి ఈ మండలి సమావేశం కావాలని సూచించారు. ఈ సమావేశంలో మరో కేంద్రమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ కూడా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు