ఆ ట్రాక్టర్లతో రైతులకు రూ.లక్ష ఆదా: కేంద్రం

దేశ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా రైతులకు ఆదాయాన్ని పెంచేలా కేంద్రం సీఎన్‌జీ ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సాగు కోసం రైతులు ఉపయోగించే డీజిల్‌ ట్రాక్టర్‌ను.. మార్పులు చేసి తొలి సీఎన్‌జీ ట్రాక్టర్‌ను ఆవిష్కరించబోతోంది. కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో

Updated : 07 Jul 2021 13:17 IST

దిల్లీ: దేశ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా రైతులకు ఆదాయాన్ని పెంచేలా కేంద్రం సీఎన్‌జీ ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సాగు కోసం రైతులు ఉపయోగించే డీజిల్‌ ట్రాక్టర్‌ను.. మార్పులు చేసి తొలి సీఎన్‌జీ ట్రాక్టర్‌ను ఆవిష్కరించబోతోంది. కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ఈ విధానానికి కేంద్రం శుక్రవారం శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

‘దేశంలోనే తొలి సీఎన్‌జీ ట్రాక్టర్‌కు కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో డీజిల్‌ ట్రాక్టర్‌ను.. సీఎన్‌జీగా మార్పులు చేయనున్నారు. ‘రామ్యాట్‌ టెక్నో సొల్యూషన్స్‌’, ‘టొమాసెటో ఆచిల్‌ ఇండియా’ సంస్థలు సంయుక్తంగా ఈ కన్వర్షన్‌ విధానాన్ని చేపట్టనున్నాయి. ఈ విధానం ద్వారా రైతులకు ట్రాక్టర్లపై పెట్టే ఇంధన ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా వారికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ విధానం ద్వారా రైతులు ఏడాదికి ఇంధన ఖర్చులపై లక్ష రూపాయల వరకూ ఆదా చేసుకోవచ్చు’ అని కేంద్రం  ఒక ప్రకటనలో తెలిపింది. 

కాలుష్యం, ఖర్చు రెండూ తక్కువే
సీఎన్‌జీ స్వచ్ఛమైన ఇంధనం. ఇందులో కాలుష్య కారక ఉద్గారాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. రైతులకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ట్రాక్టర్ల ఇంజన్‌ జీవిత కాలం పెరుగుతుంది. డీజిల్‌తో పోలిస్తే కాలుష్యం 70శాతం తక్కువ. అంతేకాకుండా ఖర్చులోనూ డీజిల్‌ లీటర్‌కు రూ.77.43 ఖర్చు అవుతుండగా.. సీఎన్‌జీకి కేజీ రూ.42 మాత్రమే ఖర్చు అవుతుందని కేంద్రం తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని