గంగాలో మృతదేహాలు: కేంద్రానికి NHRC నోటీసులు!

గంగానదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది.

Published : 14 May 2021 01:15 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న వేళ.. గంగా నదిలో వరుసగా మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. వీటిపైన ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను నాలుగు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది.

‘గంగా నదిలో మృతదేహాలను విడిచిపెట్టడం క్లీన్‌ గంగా ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘించడమే. ఈ సమయంలో మృతదేహాలను నదిలో విడిచిపెట్టడంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యింది’ అని కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చిన నోటీసుల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. గంగానదిలో లభ్యమైన మృతదేహాలు కొవిడ్‌కు సంబంధించినవే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని ఆదేశించింది. నదిలో వచ్చినవి కొవిడ్‌ మృతదేహాలని.. వాటిని తొలగించే ప్రక్రియ సరిగా లేదంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ విధంగా స్పందించింది. 

మరోవైపు గంగానదిలో మృతదేహాలు కొట్టుకురావడం కొనసాగుతూనే ఉంది. తాజాగా పీపీఈ కిట్లతో కూడిన రెండు మృతదేహాలు పట్నా సమీపంలోని గులాబీ ఘాట్‌కు కొట్టుకువచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. అంతకు ముందు బక్సార్‌ జిల్లాలో 71 మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని