75 శాతం హాజరు ఉండాల్సిందే: సీబీఎస్‌ఈ

ఈ సంవత్సరం పది, పన్నెండు తరగతుల పరీక్షలు రాయనున్న సీబీఎస్‌ఈ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి

Published : 02 Jan 2020 10:17 IST

పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు తప్పనిసరి

దిల్లీ: ఈ సంవత్సరం 10, 12 తరగతుల పరీక్షలు రాయనున్న విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి అని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయటానికి అనర్హులని బోర్డు స్పష్టం చేసింది. 2020 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల హాజరును లెక్కించాల్సిందిగా పాఠశాలలను సీబీఎస్‌ఈ ఆదేశించింది. 

సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించే 10,12 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాజరుతో సహా అన్ని రకాలుగా అర్హులైన విద్యార్థులకే హాల్‌టికెట్లు జారీ చేస్తామని బోర్డు తెలిపింది. హాజరు తక్కువగా ఉన్న విద్యార్థుల జాబితాను ప్రాంతీయ కార్యాలయాల్లో అందజేయాలని సీబీఎస్‌ఈ బోర్డు పాఠశాలలకు సూచించింది. కాగా, హాజరు తగ్గటానికి సరైన కారణాలుంటే వాటిని నిరూపించే పత్రాలను విద్యార్థులు జనవరి 7లోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని బోర్డు ఆదేశించింది. వారి విషయంలో జనవరి 7లోగా అంతిమ నిర్ణయాన్ని తీసుకుంటామని అధికారులు చెప్పారు. అంతిమ గడువు దాటిన తరువాత అందే వినతులను ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts