ఆయన మాటలు భారత్‌కు మూలస్తంభాలు
ప్రముఖ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. గురుగోవింద్ సింగ్ బోధనలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ.. ఆయన బోధనలు..
ప్రధాని మోదీ
దిల్లీ: ప్రముఖ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ పోస్టు చేశారు. గురుగోవింద్ సింగ్ బోధనలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ.. ఆయన బోధనలు ఉన్న వీడియోను ట్వీట్ చేశారు. నవ భారత్ నిర్మాణానికి గురుగోవింద్ మాటలను మూలస్తంభాలుగా ప్రధాని అభివర్ణించారు. నవభారతావని నిర్మాణానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు గురుగోవింద్ సింగ్ బోధనల్లో ఉంటాయని తాను బాగా విశ్వసిస్తానని మోదీ చెప్పారు. ఆయన బోధనలు ప్రజలపై అంతటి ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పారు.
తన జీవితాన్నంతా ప్రజలకు సేవ చేసేందుకే కేటాయించిన మహోన్నత వ్యక్తి గురుగోవింద్ సింగ్ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన అన్యాయంపై పోరాటం చేశారని, అసమాన ధైర్య సాహసాలు కనబరిచారని గుర్తు చేసుకున్నారు. భావితరాలకు ఆయన బోధనలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయని అన్నారు. ఈ మేరకు రాజ్‌నాథ్ ట్వీటర్‌లో పోస్టు చేశారు.
మరోవైపు గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో సిక్కులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రపత్రి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురుగోవింద్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Cannes: కేన్స్ వేదికగా ఇరాన్లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్ నిరసన
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
World News
2000 Notes: గల్ఫ్‌లోని భారతీయులకు రూ.2000 నోట్ల కష్టాలు
-
General News
CM Kcr: కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.. రెండ్రోజుల్లో విధివిధానాలు: సీఎం కేసీఆర్