అజిత్‌కు ఆర్థికం, ఆదిత్యకు పర్యాటకం

కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలో కొత్తగా 36 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. వీరిలో 26 మంది కేబినెట్ మంత్రులు కాగా 10 మంది సహాయ మంత్రులు...

Published : 02 Jan 2020 15:57 IST

ముంబయి: మహారాష్ట్ర మంత్రివర్గంలోని సభ్యులకు సీఎం ఉద్ధవ్‌ఠాక్రే శాఖలు కేటాయించనున్నారు. ఇటీవలే మంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. వీరిలో 26 మంది కేబినెట్ మంత్రులు కాగా 10 మంది సహాయ మంత్రులు. అయితే శాఖల కేటాయింపుల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఎన్సీపీకి కీలక శాఖలు దక్కనున్నట్లు సమాచారం. రెండో సారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖను కేటాయించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు హోం, నీటిపారుదల శాఖలను కూడా ఎన్సీపీకే కేటాయింనున్నట్లు సమాచారం. మరో కేబినెట్‌ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడైన ఆదిత్య ఠాక్రేకు పర్యావరణం, పర్యాటక శాఖ దక్కనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి  అశోక్‌ చవాన్‌కు రోడ్లు, భవనాల శాఖను ఇవ్వాలని ముఖ్యమంత్రిని కాంగ్రెస్‌ పార్టీ కోరినట్లు సమాచారం. వీటితో పాటు వ్యవసాయ శాఖను కూడా తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ కోరగా అందుకు శివసేన అంగీకరించలేదని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని