చనిపోయిన వ్యక్తి హింసకు పాల్పడ్డాడట!

హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు గాను ఆరు సంవత్సరాల క్రితమే చనిపోయిన వ్యక్తికి ఉత్తర్‌ ప్రదేశ్ పోలీసులు నోటీసులు పంపించారు.

Published : 03 Jan 2020 23:51 IST

6ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి నోటీసులు పంపిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు

ఫిరోజాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డాడంటూ ఆరు సంవత్సరాల క్రితమే చనిపోయిన వ్యక్తికి పోలీసులు నోటీసులు పంపించారు. ఫిరోజాబాద్‌ జిల్లాలో హింసాత్మక చర్యలకు పాల్పడినందుకుగానూ మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలంటూ 200 మంది నిరసనకారులకు నోటీసులు జారీ చేశారు. వాటిలో ఒకటి బన్నే ఖాన్‌ అనే వ్యక్తి పేరు మీద జారీ అయింది. అయితే బన్నే ఖాన్‌ ఆరు సంవత్సరాల క్రితమే మరణించారు. అప్పటికే ఆయన వయస్సు 94 ఏళ్లు. అంతేకాకుండా 93 సంవత్సరాల ఫసాహత్‌ మీర్‌ ఖాన్‌, 90 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు సూఫీ అన్సార్‌ హుస్సైన్‌లకు కూడా నోటీసులు అందాయి. ఈ ఇద్దరూ కూడా శాంతి స్థాపనకై కృషి చేసే స్థానిక కమిటీలో సభ్యులు. మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరై, రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించి బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని వీరికి అందిన నోటీసుల్లో ఉంది. 

ఈ విషయమై ఫిరోజాబాద్‌ పట్టణ మేజిస్ట్రేట్‌ కున్వర్‌ పంకజ్‌ సింగ్‌ స్పందిస్తూ, ‘‘శాంతిభద్రతల నిర్వహణలో మా మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. వివిధ పోలీసు స్టేషన్ల నుంచి అందిన నివేదికల మీద ఆధారపడి మేము ప్రాథమిక చర్యలు చేపట్టాము. దానిలో ఏదో పొరపాటు జరిగింది. ఆ వృద్దులపై ఏ విధమైన చర్యలు తీసుకోము.’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని