అమెరికా పౌరులారా.. ఇరాక్‌ వదిలి వెళ్లండి

ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ను అమెరికా చంపేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న

Published : 03 Jan 2020 17:36 IST

బాగ్దాద్‌: ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ను అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక్షణమే ఇరాక్‌ వదిలి వెళ్లిపోవాలని బాగ్దాద్‌లోని యూఎస్‌ ఎంబసీ కోరింది. ‘అమెరికా పౌరులు వెంటనే వాయుమార్గం ద్వారా దేశం విడిచి వెళ్లండి. అది సాధ్యం కాకపోతే కనీసం రోడ్డు, రైలు మార్గం ద్వారా అయినా ఇతర దేశాలకు వెళ్లండి’ అని ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా ఈ ఉదయం వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ సహా ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో ఇరాక్‌ ఉన్నత స్థాయి కమాండర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్‌.. ప్రతీకార దాడి తప్పదని హెచ్చరించింది. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. అమెరికా దాడిని కొన్ని దేశాలు సమర్థించగా.. మరికొన్ని దేశాలు ఆందోళనల వ్యక్తం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని