ఈడీ వలయంలో మరోసారి చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీహాడ్‌ జైలు నుంచి బెయిల్‌ విడుదలైన నెల రోజుల్లోపే కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ఈడీ మరోసారి ప్రశ్నించింది. అయితే ఈసారి విచారణ మాత్రం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాదు. ప్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థ నుంచి ఎయిరిండియా విమానాల కొనుగోలు కేసులో చిదంబరానికి సంబంధం ఉందన్న ఆరోపణలపై ఇవాళ దాదాపు 6 గంటల పాటు..

Published : 03 Jan 2020 21:48 IST

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీహాడ్‌ జైలు నుంచి బెయిల్‌ విడుదలైన నెల రోజుల్లోపే కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ఈడీ మరోసారి ప్రశ్నించింది. అయితే, ఈసారి విచారణ మాత్రం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాదు. ప్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థ నుంచి ఎయిరిండియా విమానాల కొనుగోలు కేసులో చిదంబరానికి సంబంధం ఉందన్న ఆరోపణలపై ఇవాళ దాదాపు ఆరు గంటల పాటు ఆయన్ను విచారించింది. ఈ కేసులో గత ఆగస్టు 23న విచాణకు హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. దీంతో ఆయన హాజరు కాలేకపోయారు.

విమానాల కొనుగోలుకు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరమే అనుమతులిచ్చినట్లు రికార్డుల్లో ఉండటంతో ఆయన్ని విచారంచడం అనివార్యమైంది. 43 విమానాల కొనుగోలుకు చిందబరం నేతృత్వంలోని మంత్రుల కమిటీ 2009లో అనుమతులిచ్చింది. దీనిపై అప్పటి విమానాయాన శాఖ మంత్రి ప్రపుల్‌ పటేల్‌ను ఈడీ 3 సార్లు కటకటాల్లో పెట్టింది.

ఈడీ వాదనల ప్రకారం.. ప్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ సంస్థ నుంచి 43 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి చిదంబరం నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది. ఒప్పందంలో భాగంగా దాదాపు రూ.1257 కోట్లతో శిక్షణ, నిర్వహణ సెంటర్లను కూడా విమాన తయారీ సంస్థే మనదేశంలో నిర్మించాలనే నిబంధన ఉంది. అయితే విమానాల కొనుగోలు సమయంలో ఈ నిబంధనను ఎత్తివేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని