ఇరాన్‌ మీదుగా భారత విమానాలు వద్దు..!

ఇరాక్‌లో అమెరికా జరుపుతున్న వరుస వైమానిక దాడులతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌ గగనతలానికి దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం దేశీయ విమానయాన సంస్థలకు

Published : 04 Jan 2020 10:21 IST

విమానయాన సంస్థలకు కేంద్రం సూచనలు

దిల్లీ: ఇరాక్‌లో అమెరికా జరుపుతున్న వరుస వైమానిక దాడులతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌ గగనతలానికి దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం దేశీయ విమానయాన సంస్థలకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఎయిరిండియా, ఇండిగో సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌ నుంచి అమెరికా, పశ్చిమాసియా, యూరప్‌ వెళ్లే విమానాలను దారిమళ్లించే అవకాశాలున్నాయి. 

గతేడాది జులైలోనూ ఇరాన్‌-అమెరికా మధ్య డ్రోన్‌ కూల్చివేత విషయమై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలోనూ భారత విమానయాన సంస్థలు ఇరాన్‌ గగనతలం మీదుగా వెళ్లే తమ విమానాలను దారిమళ్లించాల్సి వచ్చింది. అయితే ఇలా దారిమళ్లించడం వల్ల విమానయాన సంస్థలపై అదనపు భారం పడుతుంది. అంతేగాక, ప్రయాణ దూరం కూడా పెరుగుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్‌లైన్లు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. 

మరోవైపు తాజా పరిస్థితులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకూడదని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని