బాగ్దాద్‌లో మరోసారి క్షిపణి దాడులు

బాగ్దాద్‌లో మరోసారి క్షిపణులతో దాడి జరిగింది. బాగ్దాద్‌ గ్రీన్‌జోన్‌ పరిధిని రెండు క్షిపణులు తాకాయి. అమెరికా రాయబారి కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రాంతంలో అమెరికా సైన్యం

Published : 05 Jan 2020 01:34 IST

ఇరాక్‌: బాగ్దాద్‌లో మరోసారి క్షిపణులతో దాడి జరిగింది. బాగ్దాద్‌ గ్రీన్‌జోన్‌ పరిధిని రెండు క్షిపణులు తాకాయి. అమెరికా రాయబారి కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రాంతంలో అమెరికా సైన్యం ఉన్నట్లు సమాచారం. శనివారం ఉదయం సైతం ఇరాక్‌లో ఇరాన్‌ మద్దతున్న పారామిలిటరీ బలగాల కాన్వాయ్‌పై వైమానిక దాడులు జరిగాయి.   శుక్రవారం ఉదయం ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌కు శక్తిమంతమైన కమాండర్‌గా ఉన్న జనరల్‌ ఖాసిం సులేమానీ (62) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హషీద్‌ అల్‌ షాబీ దళ డిప్యూటీ చీఫ్‌ అబూ మహదీ అల్‌ ముహందిస్‌తో సహా మొత్తం 10 మంది చనిపోయారు. దీంతో స్పందించిన ఇరాన్‌ తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. వరుస దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని