ఏపీ మత్స్యకారులను అప్పగించిన పాక్‌

సుమారు 14 నెలలపాటు పాకిస్థాన్‌ చెరలో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అక్కడి అధికారులు భారత్‌కు అప్పగించారు. పాక్‌లోని లంధి జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి...

Updated : 06 Jan 2020 21:07 IST

అమృత్‌సర్‌: సుమారు 14 నెలలపాటు పాకిస్థాన్‌ చెరలో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అక్కడి అధికారులు భారత్‌కు అప్పగించారు. పాక్‌లోని లంధి జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి భారత అధికారులకు అప్పగించారు. మత్స్యకారులను ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారులు స్వాగతం పలికి మిఠాయిలు తినిపించారు. స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి, అధికారులు అక్కడికి వెళ్లారు. 
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వీరావాల్‌లోని చేపల వ్యాపారుల వద్ద పనిచేస్తుంటారు. చేపల వేటలో భాగంగా వీరావల్‌ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన వీరు పొరపాటున పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించటంతో... ఆ దేశ భద్రత సిబ్బంది వీరిని 2018 నవంబరులో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అప్పటి నుంచి వారంతా పాక్‌ జైళ్లలో ఉన్నారు. భారత విదేశాంగ శాఖ జోక్యంతో వీరు విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని