నా కొడుకును క్షమించండి..

దిల్లీ న్యాయస్థానం నిర్భయ కేసులో మంగళవారం దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేయడానికి ముందు కోర్టులో హృదయ విదారక సన్నివేశం చోటుచేసుకుంది. దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ తల్లి కోర్టు విచారణ సమయంలో నిర్భయ తల్లి వద్దకు వెళ్లి క్షమాభిక్ష కల్పించమని మొరపెట్టుకున్నారు.

Updated : 07 Jan 2020 20:57 IST

కోర్టులో నిర్భయ తల్లికి విన్నపం

దిల్లీ: దిల్లీ న్యాయస్థానం నిర్భయ కేసులో మంగళవారం దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేయడానికి ముందు కోర్టులో ఒక సన్నివేశం చోటుచేసుకుంది. దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ తల్లి కోర్టు విచారణ సమయంలో నిర్భయ తల్లి వద్దకు వెళ్లి క్షమాభిక్ష కల్పించమని మొరపెట్టుకున్నారు. ‘నా కుమారుడిని క్షమించండి. అతడి జీవితం కోసం నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను’ అని కోరారు. దీంతో ఆమెకు నిర్భయ తల్లి స్పందిస్తూ.. ‘నాకు కూడా బిడ్డ ఉండేది. ఆమెకు ఏం జరిగిందో నేనెలా మర్చిపోగలను. నా కుమార్తెకు న్యాయం జరగాలని నేను ఏడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను’ అని బదులిచ్చారు. వెంటనే న్యాయమూర్తి సైలెన్స్‌ అంటూ కోర్టు గదిని ఆదేశించారు. 

2012లో నిర్భయపై అత్యాచారం, హత్య చేసినందుకు గానూ నలుగురు దోషులకు దిల్లీ న్యాయస్థానం మంగళవారం డెత్‌ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు వారిని ఉరి తీయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల అనంతరం నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది. జనవరి 22 మాకు మరచిపోలేనిది. తమ కుమార్తెకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని