స్కూల్‌ బస్సును ఢీకొన్న సిలిండర్ల ట్రక్‌

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం తప్పింది. గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సును ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో

Updated : 06 Dec 2022 13:40 IST

సూరత్‌లో తప్పిన ఘోర ప్రమాదం

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం తప్పింది. గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సును ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. సూరత్‌లోని ఓల్పాడ్‌ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 

బస్సును వేగంగా ఢీకొట్టడంతో ట్రక్‌లో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ట్రక్‌లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు ఉండటంతో అవన్నీ అంటుకుని భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో స్కూల్‌ బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే విద్యార్థులను వెంటనే కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేలుడు దృశ్యాలను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని